ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi and Putin: ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

ABN, Publish Date - Sep 01 , 2025 | 03:32 PM

ఎస్‌సీఓ కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న రిట్జ్-కార్లటన్ హోటల్ వరకూ మోదీతో కలిసి ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారని, మోదీ కోసం 10 నిమిషాల పాటు వేచి చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Modi with Putin

బీజింగ్: భారత్, రష్యా అధినేతల మధ్య మరోసారి స్నేహబంధం వెల్లివిరిసింది. తింజియన్ షాంఘై సహకార సదస్సు (SCO) ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladmir Putin) సోమవారంనాడు ఒకే కారులో ప్రయాణించారు. కలిసి ద్వైపాక్షిక భేటీ వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు.

'ఎస్‌సీఓ సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి ఒకే కారులో ద్వైపాక్షిక భేటీ వేదికకు చేరుకున్నాం. ఇద్దరి మధ్య ఎప్పుడూ చాలా లోతైన చర్చలు ఉంటాయి' అని మోదీ తెలిపారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

మోదీ కోసం 10 నిమిషాలు వేచిచూసిన పుతిన్

కాగా, ఎస్‌సీఓ కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న రిట్జ్-కార్లటన్ హోటల్ వరకూ మోదీతో కలిసి ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారని, మోదీ కోసం 10 నిమిషాల పాటు వేచి చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఇద్దరు నేతలు కారులో ప్రయాణిస్తూ వివిధ అంశాలను ముచ్చటించుకున్నారు. ద్వైపాక్షిక సమావేశ వేదికకు చేరుకున్న తర్వాత కూడా ఇరువురూ మరో 45 నిమిషాలు కారులోనే సంభాషించుకున్నారు. ఆ తర్వాత ద్వైపాక్షిక భేటీ గంటకు పైగా జరిగింది' అని ఆ వర్గాలు వెల్లడించాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలుచేయడాన్ని బహిరంగంగానే అమెరికా తప్పుపట్టిన క్రమంలో మోదీ-పుతిన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాల్లోనే అత్యధికంగా భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా మాస్కో నుంచి చమురు కొనుగోలుకే భారత్ కట్టుబడింది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ఇంధన దిగుమతుల విధానాలు ఉంటాయని తెగేసి చెప్పింది. అమెరికా సుంకాలు సహేతుకం కాదని కూడా స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

పుతిన్, మోదీ మధ్య కెమిస్ట్రీ.. పాకిస్థాన్ ప్రధాని సైలెంట్.. వీడియో వైరల్..

ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 03:33 PM