PM Modi And Putin Bond: ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
ABN , Publish Date - Sep 01 , 2025 | 10:20 AM
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.
భారత్, రష్యాల మధ్య బంధం ఎలాంటితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బాగా అర్థం అయింది. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని రష్యాతో భారత్ బంధాన్ని దెబ్బతీయాలని ట్రంప్ భావించారు. రష్యాతో క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆపించాలని చూశారు. కానీ, భారత్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ అత్యంత దారుణంగా 50 శాతం టారీఫ్‌లు విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే యూరప్ దేశాలకు వైట్ హౌస్ కీలక సూచనలు చేసింది.
భారత్‌పై ఒత్తిడి తెచ్చి రష్యా నుంచి ఆయుధాలు, క్రూడ్ ఆయిల్ కొనకుండా చేయాలని యూరప్ దేశాలపై వైట్ హౌస్ ఒత్తిడి తెస్తోందట. కొన్ని దేశాలు ఇందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా భారత్, రష్యాల మధ్య బంధాన్ని తెంచడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు అసంతృప్తే మిగిలింది. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌తో ఊహించని దెబ్బ తగిలింది. అమెరికాతో గొడవలు జరుగుతున్న మూడు దిగ్గజ దేశాలు భారత్, రష్యా, చైనాల అధ్యక్షులు ఒకే చోట కలిశారు. పలు వ్యాపార, శాంతి ఒప్పందాలు చేసుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో.. మోదీ, పుతిన్ చేతిలో చెయ్యి వేసుకుని ఎంతో చక్కగా నవ్వుతూ ఉన్నారు. వారి చుట్టూ మిగిలిన దేశాల నాయకులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ పక్కకు వచ్చారు. ఎంతో సీరియస్ మాట్లాడుకుంటూ నడుస్తూ అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..
వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు