Share News

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:40 AM

లక్ష్మి ఓ ద్రవాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు.

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..
Husband Pours Acid On Wife

భార్య నల్లగా ఉందని ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె శరీరంపై యాసిడ్ పోసి నిప్పంటించి చంపేశాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి, కిషన్ భార్యా భర్తలు. పెళ్లయిన నాటి నుంచి కిషన్ తన భార్యతో రంగు విషయంలో గొడవపడుతూ ఉన్నాడు. నల్లగా ఉన్నావంటూ వేధిస్తూ ఉన్నాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువవుతూ వచ్చాయి. అతడు ఎంత తిట్టినా, కొట్టినా లక్ష్మి మౌనంగా భరిస్తూ వచ్చింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది.


కిషన్ ఆమె మౌనాన్ని చేతకాని తనంలా తీసుకున్నాడు. వేధింపుల్ని మరింత పెంచాడు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి కిషన్ భార్యను పిలిచాడు. ‘నీ కోసం ఓ మందు తెచ్చా. అది నీ శరీరానికి రాసుకుంటే తెల్లగా అవుతావు’ అని అన్నాడు. లక్ష్మి దాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు. ఆ తర్వాత అగరబత్తీతో ఆమె పొట్టపై కాల్చాడు. అంతే.. భగ్గున మంటలు అంటుకున్నాయి.


ఆమె మంటల్లో కాలిపోతూ గట్టిగా అరుస్తూ ఉంది. అతడామెను రక్షించాల్సిందిపోయి మిగిలిన యాసిడ్‌ను కూడా శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కిషన్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా, అతడిని అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడికి మరణ శిక్ష విధించారు.


ఇవి కూడా చదవండి

బీ ఏ హీరో.. అడాప్ట్ పప్పీ నినాదంతో జాతీయ కుక్కల దత్తత మేళా

వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

Updated Date - Sep 01 , 2025 | 08:57 AM