LPG Prices Slashed: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:12 AM
ఇంటర్‌నేషనల్ ఎనర్జీ ధరల్లో కదలికల్ని బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతీ నెలా ధరల్ని మారుస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ ఆదివారం ప్రకటన చేశాయి. ఈ నిర్ణయం కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర బిజినెస్‌లకు లాభం చేకూరనుంది. తగ్గిన ధరలతో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల అమ్మకం సోమవారం( సెప్టెంబర్ 1)నుంచి ప్రారంభంకానుంది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర 1631.50 రూపాయలు ఉండేది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న తాజా నిర్ణయంతో 51.50 రూపాయలు తగ్గింది. గ్యాస్ సిలిండర్ 1,580 రూపాయలకే అందుబాటులోకి వస్తోంది. తగ్గిన ధరల కారణంగా హోటళ్లు, ఢాబాలు, టిఫిన్ బండ్లు, చిన్న స్థాయి ఫుడ్ బిజినెస్‌లకు ఊరట లభిస్తుంది. తగ్గింది తక్కువ మొత్తమే అయినా.. ఓవర్ ఆల్ కాస్ట్‌పై ఈ ప్రభావం చాలా పాజిటివ్‌గా ఉంటుందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. కాగా, ఇంటర్‌నేషనల్ ఎనర్జీ ధరల్లో కదలికల్ని బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతీ నెలా ధరల్ని మారుస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి.
అధిక ధరలు వసూలు చేస్తే కేసులు...
హైదరాబాద్ నగరంలో కొంతమంది గ్యాస్ డీలర్లు, డెలవరీ బాయ్‌లు రెచ్చిపోతున్నారు. కస్టమర్ల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్‌ల అక్రమాలపై పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పందించారు. గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ డీలర్ షిప్ లాభాపేక్షతో కూడింది కాదన్నారు. చమురు సంస్థలు డోర్ డెలివరీ ఛార్జీలు డీలర్‌లకు చెల్లిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
భారత్, చైనా శత్రవులు కాదు.. ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయాలి: జిన్‌పింగ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..