Share News

Road Accident inTelangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 07:32 AM

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో ముగ్గురికు తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident inTelangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..
Road Accident inTelangana

మహబూబ్‌నగర్,సెప్టెంబర్1 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పిస్తున్నాయి. అయినా వాహనదారులు తీవ్ర నిర్లక్ష్యంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో అతివేగంతో వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయిన కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి.


తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar Road Accident) అడ్డాకుల మండలం కాటారం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు (BCVR Travels Bus) కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో నుంచి ఎగిరిపడి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన విషయాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. పోలీసుల సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

కారు నడుపుతుండగా గుండెపోటు

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 08:26 AM