Heart Attack: కారు నడుపుతుండగా గుండెపోటు
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:59 AM
పారిస్‌లో ఎనిమిదేళ్లు పనిచేసి, ఏడాది క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో శనివారం రాత్రి జరిగింది.
ఆస్పత్రికి తరలించేలోపే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
కొత్తూర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పారిస్‌లో ఎనిమిదేళ్లు పనిచేసి, ఏడాది క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో శనివారం రాత్రి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్‌కి చెందిన రవికుమార్ (31) ఎనిమిదేళ్లు పారి్‌సలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి 7 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇక్కడే స్థిరపడాలనుకుని హైదరాబాద్‌లో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ వ్యాపారంపై దృష్టి సారించాడు.
శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తన కారులో బయల్దేరాడు. కారు కొత్తూర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా రవికుమార్‌కు గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. అందులో ఉన్నవారు కారును అదుపుచేసి రవికుమార్‌ను కొత్తూర్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు తుది శ్వాస విడిచాడు. రవికుమార్ భార్య 5 నెలల గర్భవతి.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..