Khairatabad Bada Ganesh Darshan: మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:02 PM
ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల సమయం పడుతోంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే 5 లక్షలకు పైగా మంది భక్తులు వినాయకుడ్ని దర్శించుకునే అవకాశం ఉంది. తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు రెండున్నర లక్షల మంది భక్తులు మహా గణపతిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్, లకిడీకపూల్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, సెక్రటేరియట్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
6వ తేదీన మహా గణపతి నిమజ్జనం..
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీన విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన వినాయకుడి నిమజ్జనం జరగాల్సి ఉండింది. అయితే, అదే రోజు చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం నేపథ్యంలో నిమజ్జనం ప్రీపోన్ అయింది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు మహా గణపతి శోభాయాత్ర నిర్వహించి, నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
అమితాబ్‌కు 4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు.. చెంప పగులగొట్టిన తల్లి.
ఉపేంద్ర సినిమా రిపీట్.. బయటపడ్డ నిత్య పెళ్లి కొడుకు బాగోతాలు..