Cheating Woman Promise Of Marriage: ఉపేంద్ర సినిమా రిపీట్.. బయటపడ్డ నిత్య పెళ్లి కొడుకు బాగోతాలు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:11 PM
జైల్లో ఉన్నా అతడిలో మార్పు రాలేదు. రెండో బాధితురాలికి పెళ్లి పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను కూడా ఇలాగే మోసం చేశాడు. మూడో బాధితురాలు అతడిపై రేప్ కేసు పెట్టింది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ‘బుద్ధిమంతుడు’ సినిమాలో హీరో పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ ఉంటాడు. దాదాపు నలుగురు అమ్మాయిల్ని మోసం చేస్తాడు. కొంచెం అటు, ఇటుగా ఇలాంటి స్టోరీనే కన్నడనాట చోటుచేసుకుంది. ఓ నిత్య పెళ్లి కొడుకు యువతుల్ని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడు. పెళ్లైన తర్వాత డబ్బు, నగలతో ఉడాయిస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రెండు, మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే దారిలో నడుస్తున్నాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరు, పట్టెగారపల్లికి చెందిన మిథున్ కుమార్ అమ్మానాన్న లేని అమ్మాయిల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఆరేళ్ల క్రితం అతడికి ఓ అమ్మాయితో పరిచయం అయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ నాలుగు నెలల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. సడెన్‌గా ఓ రోజు ఆమె డబ్బులు, నగలతో మిథున్ పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిథున్‌ను అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు.
జైల్లో ఉన్నా అతడిలో మార్పు రాలేదు. రెండో బాధితురాలికి పెళ్లి పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను కూడా ఇలాగే మోసం చేశాడు. మూడో బాధితురాలు అతడిపై రేప్ కేసు పెట్టింది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. తర్వాత నాలుగో బాధితురాలి వెనకాల పడ్డాడు. ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గరినుండి డబ్బు, నగలు దోచుకెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిథున్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో చిప్ప కూడు తింటూ ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ.. అత్తా, భార్యను చంపేసిన యోగేష్
బుల్లితెరలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..