4 Crore Car To Amitabh Bachchan: అమితాబ్‌కు 4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు.. చెంప పగులగొట్టిన తల్లి..
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:27 PM
ఏకలవ్యలో నటించినందుకు గాను అమితాబ్‌కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని విధు వినోద్ భావించారు. 4.5 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆ కారును అమితాబ్‌కు ఇవ్వడానికి తన తల్లిని వెంట తీసుకెళ్లారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ట్వెల్త్ ఫెయిల్ సినిమా దర్శకుడు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ట్వెల్త్ ఫెయిల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటమే కాదు.. హీరో విక్రాంత్ మెస్సేకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విధు వినోద్ చోప్రా.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కారణంగా తల్లితో చెంప దెబ్బ తినాల్సి వచ్చిందట. ఇంతకీ సంగతేంటంటే.. 2007లో విధు వినోద్ ‘ఏకలవ్య’ అనే సినిమా చేశారు.
ఆ సినిమాకు దర్శకుడు, నిర్మాత, రైటర్ కూడా విధు వినోదే. ఆ సినిమాలో అమితాబ్ నటించారు. ఏకలవ్యలో నటించినందుకు గాను అమితాబ్‌కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని విధు వినోద్ భావించారు. 4.5 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆ కారును అమితాబ్‌కు ఇవ్వడానికి తన తల్లిని వెంట తీసుకెళ్లారు. కారు తాళాలను స్వయంగా ఆమే అమితాబ్‌కు ఇచ్చింది. ఆ తర్వాత విధు వినోద్ తల్లితో కలిసి తన కారులో కూర్చున్నారు. అది బ్లూ కలర్ మారుతీ వ్యాన్. కారులో కూర్చున్న వెంటనే ‘నువ్వు లంబూకు కారు ఇచ్చావా?’ అని తల్లి అడిగింది.
‘అవును’ అన్నాడు విధు వినోద్. ‘నువ్వు నీ కోసం కారు ఎందుకు కొనుక్కోలేదు’ అని అడిగింది. ‘సమయం వచ్చినపుడు కొంటా?’అని విధు వినోద్ అన్నాడు. ‘ఆ కారు 11 లక్షలు ఉంటుందా?’ అని తల్లి అడిగింది. విధు వినోద్ నవ్వి కారు ధర ఎంతో చెప్పాడు. అంతే.. తల్లి విధు వినోద్ చెంప పగుల గొట్టింది. ‘బేవకూఫ్’ అని తిట్టింది. ఈ విషయాలను ఓ పాత ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా చెప్పుకొచ్చాడు. తల్లి కొట్టిన చెంప దెబ్బను, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని, సంతోషం ఇవ్వకపోతే డబ్బులు ఎందుకని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
ఉపేంద్ర సినిమా రిపీట్.. బయటపడ్డ నిత్య పెళ్లి కొడుకు బాగోతాలు..
బర్త్‌డే గిఫ్ట్స్ విషయంలో గొడవ.. అత్తా, భార్యను చంపేసిన యోగేష్