YS Jagan: లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:12 PM
సెప్టెంబర్ నెల చివరి వారంలోపు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి అరెస్టు కావడం ఖాయం అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. ఇప్పటికే జగన్ పైన ఉన్న సీబీఐ కేసులో ఫైన్ మాత్రమే పడే అవకాశం ఉందని, అయితే లిక్కర్ కేసులో మాత్రం ఆయన జైలుకు పోవటం ఖాయమని చెప్పారు.
తిరుపతి: సెప్టెంబర్ నెల చివరి వారంలోపు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) అరెస్టు కావడం ఖాయం అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. ఇప్పటికే జగన్ పైన ఉన్న సీబీఐ కేసులో ఫైన్ మాత్రమే పడే అవకాశం ఉందని, అయితే లిక్కర్ కేసులో మాత్రం ఆయన జైలుకు పోవటం ఖాయమని చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన పర్యటించారు. జగన్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, పులివెందుల ప్యాలెస్‌లలో దాడులు చేస్తే వేల కోట్ల రూపాయల డబ్బులు, బంగారం దొరుకుతుందని అన్నారు (YS Jagan arrest).
సీబీఐ కేసులో జగన్ బెయిల్ కోసం తానే కాంగ్రెస్ అధిష్ఠానంతో సయోధ్య నడిపానని, ఎట్టి పరిస్థితిలోనూ మత పార్టీకి మద్దతు ఇవ్వనని మాట ఇచ్చాకే జగన్ బెయిల్ పొందాడని గోనె వెల్లడించారు (Andhra Pradesh politics). అయితే 2014 నుంచి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసులకు భయపడే బీజేపీకి జగన్ మద్దతు ఇస్తున్నాడన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌ను ప్రధాని మోదీ కానీ, బీజేపీ అగ్ర నాయకత్వం కానీ మద్దతు కోరలేదని, వీరే మద్దతు కోరినట్టు ప్రచారం చేసుకుని సపోర్టు చేస్తున్నారని విమర్శించారు (Jagan Mohan Reddy news).
శ్రీలక్ష్మీ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగనట్టు ఉందని దుయ్యబట్టారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీరే నిజాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాావాలని భూమన కరుణాకర్ రెడ్డిని చేతులెత్తి దండంపెట్టి అడుగుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ టీడీఆర్ బాండ్ల కేసుపై దృష్టిపెట్టాలని, ఆ బాండ్ల స్కామ్ బాధ్యుల ఆస్తులను సీజ్ చేసి, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం
For More AP News And Telugu News