Australian Honor For Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:15 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావాలని లోకేష్‌కు ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆహ్వానం పలికింది.
అమరావతి, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు (Minister Nara Lokesh) మరో అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావాలని లోకేష్‌కు ఆస్ట్రేలియన్ హైకమిషన్ (Australian High Commission) ఆహ్వానం పలికింది.
ఈ మేరకు లోకేష్‌కు ఆహ్వానం పలుకుతూ లేఖ పంపించింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. మానవవనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధిలో ఏపీని ప్రశంసించింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. ప్రస్తుత ప్రధాని 2001లో ఎస్‌వీపీలో భాగస్వామ్యం అయ్యారని ఆస్ట్రేలియన్ హైకమిషన్ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టరేట్ నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం
For More AP News And Telugu News