Share News

Modi Putin Shehbaz video: పుతిన్, మోదీ మధ్య కెమిస్ట్రీ.. పాకిస్థాన్ ప్రధాని సైలెంట్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:11 PM

షాంఘై సహకార సదస్సు కోసం చైనాలోని తియాన్‌జిన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సరదాగా గడిపారు. పుతిన్‌ను కౌగిలించుకుని, ఆయన చేతిలో చేయి వేసి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఇదే సమావేశానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు.

Modi Putin Shehbaz video: పుతిన్, మోదీ మధ్య కెమిస్ట్రీ.. పాకిస్థాన్ ప్రధాని సైలెంట్.. వీడియో వైరల్..
Modi Putin Shehbaz video

షాంఘై సహకార సదస్సు (SCO) కోసం చైనాలోని తియాన్‌జిన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సరదాగా గడిపారు. పుతిన్‌ చేతిలో చేయి వేసి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు (Modi Putin SCO summit). ఇదే సమావేశానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. అయితే ఆయనను ప్రధాని మోదీ పట్టించుకోలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్, భారత్ ప్రధానులు ఒక సమావేశంలో కలవడం ఇదే తొలిసారి (Shehbaz Sharif snubbed).


ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడే షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. అతడిని ఇరువురు నేతలూ పట్టించుకోలేదు (Shehbaz sidelined). ఈ సదస్సులో చాలా సందర్భాలలో షరీఫ్‌కు మోదీ దూరంగానే ఉండిపోయారు. ఇక, పుతిన్ ఇతర దేశాల నేతలను పలకరిస్తున్న సమయంలో షెహబాజ్ షరీఫ్ వారిందరినీ దాటుకుని పుతిన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు (Pakistan PM ignored).


కాగా, అంతకుముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదం గురించి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు. ఇరు దేశాలు అన్ని రంగాల్లోనూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఒక అభిప్రాయానికి వచ్చారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 12:25 PM