ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Putin - Taliban Rule: ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు.. పాక్‌కు షాక్

ABN, Publish Date - Dec 06 , 2025 | 07:38 AM

పాకిస్థాన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిషాకిచ్చారు. అఫ్గానిస్థాన్ పాలకులు తాలిబన్లు అన్న వాస్తవాన్ని అంగీకరించాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, డ్రగ్స్ ఉత్పత్తి కట్టడికి తాలిబన్లు కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు.

Putin on Taliban Government in Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ల పాలనను గుర్తించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పాలన ఓ వాస్తవమని అన్నారు. తాలిబన్లు ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తున్నారని, ఓపియం ఉత్పత్తికి కూడా బ్రేకులు వేస్తున్నారని కితాబునిచ్చారు. భారత పర్యటన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ కామెంట్స్ చేశారు. పుతిన్ కామెంట్స్‌తో దాయాది దేశం పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తాలిబన్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని పాక్ తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. (Putin on Taliban Rule in Afghanistan).

‘ప్రతి దేశంలో ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇందుకు అఫ్గానిస్థాన్ ఏమీ మినహాయింపు కాదు. అక్కడ దశాబ్దాల పాటు అంతర్యుద్ధం కొనసాగింది. ఇది దారుణం. అయితే, ప్రస్తుతం అఫ్గానిస్థాన్ తాలిబన్ల నియంత్రణలో ఉంది. ఇది స్పష్టం. ప్రస్తుతం మనం అందరం అంగీకరించాల్సిన వాస్తవం ఇది. అఫ్గాన్ నాయకులు ఓపియం ఉత్పత్తిని చాలా వరకూ కట్టడి చేశారు. తమ భూభాగం నుంచి ప్రపంచానికి సవాలు విసురుతున్న డ్రగ్స్‌ ముప్పును కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నాయకత్వంతో టచ్‌లో ఉండటం తప్పనిసరి’ అని పుతిన్ తేల్చి చెప్పారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను గుర్తించిన మొట్టమొదటి దేశం రష్యా. అంతేకాకుండా, తాలిబన్ ప్రతినిధులను కూడా మాస్కోకు ఆహ్వానించింది. ఇక పుతిన్ తాజా వ్యాఖ్యలతో పాక్‌కు గట్టి షాక్ తగిలినట్టైంది. తాలిబన్లు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నారంటూ పాకిస్థాన్ తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తమ దేశంపైకి తాలిబన్లు టీటీపీ ఉగ్రవాదులను రెచ్చగొడుతున్నారని మండిపడుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పాతాళానికి దిగజారాయి. సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చదవండి:

వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 09:48 AM