ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Plane crash: కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్

ABN, Publish Date - Dec 10 , 2025 | 09:46 AM

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం హఠాత్తుగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ స్వల్ప గాయాలతో బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Plane crash

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును అనూహ్యంగా ఓ విమానం వెనుక నుంచి ఢీ కొట్టింది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్-95 నేషనల్ హైవేపై హఠాత్తుగా ఓ విమానం నేలపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో అది(Plane crash) వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళకు గాయాలయ్యాయి. సదరు మహిళ ఓ పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ఓ ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటిపడినట్లు తెలిపారు. విమానం ఎమర్జెన్సీగా నేలపై ఎందుకు ల్యాండ్ అయింది అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఎమర్జీన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం హైవేపై కిందకు దిగుతుండటం, ఆ సమయంలోనే రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టడం.. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?

అతడి వికెట్ కీలకం: మార్‌క్రమ్

Updated Date - Dec 10 , 2025 | 10:38 AM