Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం
ABN, Publish Date - May 01 , 2025 | 08:09 AM
Pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇస్లామాబాద్, మే 1: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా యుద్ధ వాతావరణం నెలకొంది. అలాంటి వేళ ఆ దేశ నూతన జాతీయ భద్రత సలహాదారుడిగా లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసిమ్ మాలిక్‌ను నియమించింది. ఐఎస్ఐ చీఫ్‌గా పని చేస్తున్న మాలిక్‌కు జాతీయ భద్రతా సలహాదారుడిగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఇక ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పని చేసే ముందు మాలిక్ పాకిస్థాన్ జనరల్ అడ్జటంట్ జనరల్‌గా విధులు నిర్వహించారు. ఆయన హాయాంలోనే మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ జరిగింది. అలాగే పాకిస్థాన్‌లోని అత్యంత సమస్యాత్మకమైన బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్థాన్‌లోని విభాగాలకు ఆయన నాయకత్వం వహించారు. ఆ క్రమంలో పలు సవాళ్లను సైతం లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ ఎదుర్కొన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ సాక్ష్యాలను సైతం సేకరించింది. ఈ నేపథ్యంలో పాక్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. అలాగే పాకిస్థాన్ సైతం భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. అదీకాక పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి తరార్ అయితే.. 36 గంటల్లోపు పాకిస్థాన్‌పై భారత్ యద్ధం చేయనుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జోలికి వస్తే ఊరుకోమంటూ భారత్‌ను హెచ్చరించారు. మరోవైపు వరుసగా ఏడో రోజు.. వాస్తవాదీన రేఖ వెంబడి భారత్ భూభాగంగాపైకి పాక్ సైనిక దళాలు కాల్పులు జరిపాయి.
ఇంకోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.అనంతరం రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు సైతం జరిగాయి. అదీకాక సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
AI coding: మా కంపెనీ కోడ్‌లో 30 శాతం ఏఐతోనే
Pahalgam Terror Attack: ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
For National News And Telugu News
Updated Date - May 01 , 2025 | 10:38 AM