Operation Bunyan: పరువు తీసుకుంటున్న పాకిస్థాన్
ABN, Publish Date - May 26 , 2025 | 02:09 PM
పాకిస్థాన్ తన పరువు తానే తీసుకుంటుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.
న్యూఢిల్లీ, మే 26: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్ పైచేయి సాధించింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్‌పై విజయం సాధించినట్లు భావిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ బున్యన్‌లో పాకిస్థాన్ ఘన విజయాన్ని అందుకుంది. అందుకు ప్రతీకగా పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్ ఓ ఫోటోను బహుమతిగా ఇస్తున్నట్లు ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఆ క్రమంలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
విజయం నకిలీదే.. అలాగే ఈ ఫోటో సైతం నకిలీదంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. కనీసం మిలటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన చిత్రాలు సైతం ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదంటూ పాక్ ఆర్మీ ఉన్నతాధికారులకు మరో నెటిజన్ చురకలంటించారు. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ మరొకరు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరించారు. ఇక మున్నీర్ పదోన్నతిపై సైతం విమర్శలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఇటీవల పాకిస్థాన్‌లో అత్యున్నత స్థాయిలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు దేశాధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని బలమైన సాక్ష్యాధారాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచం ముందు ఉంచింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 21 ప్రాంతాల్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది.
అందుకు ప్రతిగా పాకిస్థాన్ సైతం భారత్ సరిహాద్దుల్లోని రాష్ట్రాల్లోని ప్రజలే లక్ష్యంగా డ్రోనులు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 27 మంది మరణించారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే క్షిపణలు, డ్రోనులను భారత్ తిప్పికొట్టింది. దీంతో పాకిస్థాన్ దిగి వచ్చింది. ఆ క్రమంలో ఇరు దేశాలు కాల్పు విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి వేళ.. భారత్‌పై పాకిస్థాన్ పైచేయి సాధించినట్లు ఫోటో వైరల్ కావడంతో ఆ దేశ మిలటరీ చీఫ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..
భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ
For International news And Telugu News
Updated Date - May 26 , 2025 | 04:24 PM