Osama bin Laden: ఆడ వేషం వేసుకుని బిన్ లాడెన్ తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి
ABN, Publish Date - Oct 25 , 2025 | 12:12 PM
అమెరికాలో జరిగిన 2001 సెప్టెంబర్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్‌ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ఆ దేశం ఎంతగానో శ్రమించింది. దాదాపు 10 ఏళ్లు విస్తృతంగా గాలించి చివరకు తుదముట్టించింది.
అమెరికాలో జరిగిన 2001 సెప్టెంబర్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్‌ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ఆ దేశం ఎంతగానో శ్రమించింది. దాదాపు 10 ఏళ్లు విస్తృతంగా గాలించి చివరకు తుదముట్టించింది. అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌లో అతడిని చుట్టుముట్టినపుడు అతడు ఆడవేషంలో తప్పించుకున్నాడట. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ ఏజెంట్ కిరయకౌ వెల్లడించారు (Osama bin Laden escape).
కిరియకౌ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. పాకిస్థాన్‌లో అమెరికా కౌంటర్ టెర్రరిజమ్ విభాగాన్ని నడిపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిన్ లాడెన్ తప్పించుకున్న విషయం గురించి వెల్లడించారు. 'ఆ దాడి జరిగిన నెల రోజుల తర్వాత అఫ్గానిస్థాన్‌లోని తోరాబోరా గుహల్లో లాడెన్ ఉన్నట్లు గుర్తించాం. ఆ సమయంలో సెంట్రల్ కమాండ్ లో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్ మమ్మల్ని ఏమర్చాడు. అతడు ఆల్‌ఖయిదాకు చెందిన వ్యక్తి అని ఆలస్యంగా గుర్తించాం. అతడి వల్ల లాడెన్ తప్పించుకున్నాడు' అని కిరయకౌ తెలిపారు (Bin Laden woman disguise).
'గుహల నుంచి బయటకు రావాలని లాడెన్‌కు వార్నింగ్ ఇచ్చాం. కానీ వాళ్లు సాయంత్రం వరకు టైం అడిగారు. మహిళలు, పిల్లలను బయటకు పంపేందుకు సమయం కావాలన్నారు. ఆ ఐడియాకు ఓకే చెప్పాలని జనరల్ ఫ్రాంక్స్‌ను ఆ ట్రాన్స్‌లేటర్ ఒప్పించాడు. ఆ సమయంలో లాడెన్ మహిళల దుస్తులు ధరించి అక్కడ నుంచి పాకిస్థాన్‌కు పరారీ అయ్యాడు. తెల్లవారేసరికి ఆ గుహల్లో ఎవరూ లేరు. దాంతో మా పోరాటాన్ని పాకిస్థాన్‌కు మార్చాం' అని కిరయకౌ చెప్పారు (CIA secrets). అప్పుడు తప్పించుకున్న లాడెన్ ఆచూకీ 2011 వరకు అమెరికాకు చిక్కలేదు.
ఇవి కూడా చదవండి..
India Pakistan War: భారత్‌తో యుద్ధం పాక్‌కే నష్టం.. మాజీ సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trump Canada trade talks: ఆ యాడ్‌పై ట్రంప్ ఫైర్.. కెనడాతో ట్రేడ్ టాక్ నిలిపివేత..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 25 , 2025 | 12:12 PM