ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nvidia CEO Jensen Huang: డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు... ఆ కస్టమర్లు హ్యాపీ!

ABN, Publish Date - Nov 01 , 2025 | 11:57 AM

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ , శాంసంగ్ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌, హ్యుందాయ్‌ ఛైర్మన్‌ చుంగ్ యుయి-సన్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.

APEC Summit

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం ఎంతోమంది వివిధ రెస్టారెంట్లకు, హోటల్స్ కు వెళ్తుంటారు. అక్కడ తమకు ఇష్టమైన ఫుడ్ ను ఆర్డర్ చేస్తారు. అలానే ఇటీవల ఓ ప్రాంతంలో రెస్టారెంట్ కు వెళ్లిన కస్టమర్లు ఎగిరి గంతేసే సంఘటన ఒకటి జరిగింది. వారి బిల్లులు మొత్తం ఓ ముగ్గురు ఫేమస్ బిలియనీర్లు చెల్లించారు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది?. ఆ ముగ్గురు బిలియనీర్లు ఎవరు?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ (Jensen Huang), శాంసంగ్ (Samsung) ఛైర్మన్‌ లీ జే యాంగ్‌, హ్యుందాయ్‌ (Hyundai) ఛైర్మన్‌ చుంగ్ యుయి-సన్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా (South Korea)లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశం( South Korea APEC Summit)లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో సియోల్‌(Seoul restaurant)లో అత్యంత ఫేమస్ అయిన క్యాన్‌బు చికెన్‌ రెస్టారెంట్‌ లో డిన్నర్ కు వెళ్లారు. వీరు చీజ్‌ బాల్స్‌, చీజ్‌ స్టిక్స్‌, బోన్‌లెస్ చికెన్‌, ఫ్రైడ్ చికెన్‌లతో పాటు మరికొన్ని డ్రింక్‌లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ముగ్గురు (Nvidia Samsung Hyundai)బిలియనీర్లను చూసేందుకు అక్కడివారంతా గుమిగూడగారు. ఈ క్రమంలో హువాంగ్‌ తమను చూసేందుకు వచ్చిన ప్రజలకు చీజ్‌, ఫ్రైడ్‌ చికెన్‌ను బయటకు వచ్చి అందించారు. తరువాత అక్కడ ఉన్న వారితో లీ జే యాంగ్ ముచ్చటించారు. అంతేకాక ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చి..అక్కడి వారిని సంతోష పెట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు హువాంగ్‌ హోటల్ సిబ్బందికి బహుమతులు అందజేశారు.

ఈ క్రమంలో రెస్టారెంట్‌(Seoul restaurant)లోని కస్టమర్లందరి బిల్లులను తామే చెల్లిస్తామని హువాంగ్‌ ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న కస్టమర్లు ఆశ్చర్యపోయారు. వీరి డిన్నర్‌ డేట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు(Jensen Huang viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాము వెళ్లే రెస్టారెంట్లకు ఈ బిలియనీర్లు ఒకసారి వస్తే బాగుండూ అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

చంపుతామంటూ బీజేపీ ఎంపీకి ఫోనులో బెదిరింపులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 11:58 AM