Nobel Prize 2025: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
ABN, Publish Date - Oct 08 , 2025 | 04:32 PM
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు గాను నోబెల్ ఫ్రైజ్ లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్ యాఘీలకు నోబెల్ బహుమతిని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు గాను నోబెల్ ఫ్రైజ్ లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్ యాఘీలకు నోబెల్ బహుమతిని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరు కొత్త రకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. గతేడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లు ఈ పురస్కారం అందుకున్నారు.
కాగా, ఈ ఏడాది ఇప్పటికే వైద్య శాస్త్రంలో బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, డాక్టర్ షికోమ్ సకాగుచీకి నోబెల్ బహుమతి ఎంపికయ్యారు. అలానే భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టీనిస్, మైఖేల్ హెచ్ డెవొరెట్‌ను నోబెల్ కమిటీ ప్రకటించింది. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.
Also Read:
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం
Updated Date - Oct 08 , 2025 | 04:54 PM