Share News

Bihar Electins 2025: బీజేపీ ఎలక్షన్ కమిటీ కీలక సమావేశం.. అభ్యర్థుల పేర్లపై చర్చ

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:12 PM

బీజేపీ ఎలక్షన్ కమిటీ బుధవారంనాడు పాట్నాలో కీలక సమావేశం జరిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కో-ఇన్‌చార్జి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

Bihar Electins 2025: బీజేపీ ఎలక్షన్ కమిటీ కీలక సమావేశం.. అభ్యర్థుల పేర్లపై చర్చ
Bihar Assembly Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీలు వెలువడటంతో ప్రధాన పార్టీలు, కూటముల్లో ఒక్కసారిగా వేడి మొదలైంది. సీట్ల షేరింగ్, అభ్యర్థుల పేర్ల ఖరారుపై విస్తృత మంతనాలు, సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ ఎలక్షన్ కమిటీ (BJP election committee) బుధవారంనాడు పాట్నాలో కీలక సమావేశం జరిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కో-ఇన్‌చార్జి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బీజేపీ కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.


ఎన్డీయే కీలక సమావేశం

కాగా, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల కీలక సమావేశం కూడా బుధవారంనాడు పాట్నాలో నిర్వహిస్తున్నారు. బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ (రామ్‌‌విలాస్), ఇతర భాగస్వామ్య పార్టీలకు చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఆయా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ, జేడీయూ చెరో 103 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జితిన్ రామ్ మాంఝీ 'హిందుస్థాని అవామ్ మోర్చా' 15 నుంచి 18 సీట్లు డిమాండ్ చేస్తోంది. బీజేపీ 7 నుంచి 8 సీట్లు ఇవ్వచూపుతోంది. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 40 నుంచి 50 సీట్లు కోరుతుండగా, బీజేపీ 20 సీట్లు ప్రతిపాదిస్తోంది.


మరోవైపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు బుధవారంనాడు పాట్నాలో సమావేశమవుతోంది. సీట్ల షేరింగ్ ఫార్ములాను మాత్ర విపక్ష 'ఇండియా' కూటమి ఇంకా ప్రకటించలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 6,11 తేదీల్లో రెండు విడతల్లో నిర్వహించనున్నట్టు ఈసీ ఇటీవల ప్రకటించింది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టుకు విజయ్

సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 08 , 2025 | 04:15 PM