Zubeen Garg Death Case: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:29 PM
జుబీన్ కజిన్, అస్సాం పోలీస్ అధికారి సందీపన్ గార్గ్ అరెస్ట్ అయ్యారు. సీఐడీ వరుస విచారణల తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంది. సింగర్ పర్యటన వేళ సందీపన్ అతని వెంటే ఉన్నారు.
Zubeen Garg Death: అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అతని కజిన్, అస్సాం పోలీస్ సర్వీస్ (APS) అధికారి సందీపన్ గార్గ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో జుబీన్‌తోనే సందీపన్ ఉన్నారని చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెల 19న సింగపూర్‌లో అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ పర్యటనకు జుబీన్ వెళ్లారు. ప్రమాదం కారణంగానే ఆయన మృతిచెందారని తొలుత భావించినా, పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అస్సాం సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా గుప్తా మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.
‘జుబీన్ కజిన్, అస్సాం పోలీస్ అధికారి సందీపన్ గార్గ్ అరెస్ట్ అయ్యారు. సీఐడీ వరుస విచారణల తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంది. సింగర్ పర్యటన వేళ సందీపన్ అతని వెంటే ఉన్నారు. అతడికి అది తొలి విదేశీ పర్యటన. యాట్ పార్టీలో కూడా సందీపన్ పాల్గొన్నారు. జుబీన్ మృతి తర్వాత ఆయన వస్తువులు కొన్నింటిని స్వదేశానికి తీసుకువచ్చారు. సందీపన్ అస్సాం పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడితో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్టయ్యారు’ అని మున్నా గుప్తా మీడియాకు వివరించారు.
ఈ కేసులో ఇప్పటికే గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శంకను మహంతలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తొలుత ప్రమాదంలో గార్గ్ చనిపోయాడని అనుకున్నప్పటికీ.. ఆయనకు విషం ఇచ్చి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ప్రత్యేక బృందం (SIT) విచారణ చేపట్టింది.
Also Read:
స్టార్ కమెడియన్ అరెస్ట్.. కారణం తెలిస్తే ఛీ కొడతారు..
భారత పర్యటనపై బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు