Share News

Hyderabad Rain: నగరంలో క్లైమేట్‌ ఛేంజ్‌.. పలు చోట్ల వర్షం..

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:24 PM

ఎండాకాలంలోనూ లేనంత వేడిగా ఇప్పుడు వాతావరణం ఉంది. దీని వల్లనే వాతావరణంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Hyderabad Rain: నగరంలో క్లైమేట్‌ ఛేంజ్‌.. పలు చోట్ల వర్షం..
Rain Alert

హైదరాబాద్: నగరంలోని వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు ఏర్పడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎండతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడంతో.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఎండాకాలంలోనూ లేనంత వేడిగా ఇప్పుడు వాతావరణం ఉంది. ఈ వేడి ప్రభావంతోనే.. వాతావరణంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పులు దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌, ఫిలింనగర్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది.


ఇవి కూడా చదవండి :

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 08 , 2025 | 03:39 PM