Bharathi Kannan Arrest: బాలికతో వ్యభిచారం.. కమెడియన్ అరెస్ట్..
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:24 PM
బాలికతో వ్యభిచారం చేయించిన హాస్య నటుడు భారతి కన్నన్ ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం చెన్నై నగరంలోని కోయంబేడు ప్రాంతంలో ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
చెన్నై, అక్టోబర్ 08: బాలికతో వ్యభిచారం చేయించిన హాస్య నటుడు భారతి కన్నన్ ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం చెన్నై నగరంలోని కోయంబేడు ప్రాంతంలో ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు ఆగస్టు 24వ తేదీ ఆ ఇంటిపై పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి కేకే నగర్‌కు చెందిన 9వ తరగతి చదివే బాలికను అరెస్టు చేశారు. ఈ కేసులోనే దర్యాప్తు చేపట్టిన తమిళనాడు పోలీసులు..ఏపీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు నాగలక్ష్మి, అంజలి, కార్తీక్ కుమార్‌ను కోయంబేడు పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. బాలిక తండ్రి మృతి చెందడంతో తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో బాలిక తన తల్లి ఫ్రెండైన కేకే నగర్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ పూంగొడి, ఈమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరింది. వీరిద్దరు కమెడియన్ భారతి కన్నన్‌తో కలిసి బాలికతో వ్యభిచారం చేయించి.. రూ.లక్షల్లో సంపాదించినట్లు విచారణలో తేలింది. దీంతో తాజాగా పోలీసులు పూంగొడి, ఐశ్వర్యను అరెస్టు చేశారు. అదేవిధంగా భారతి కన్నన్, మహేంద్రన్, రమేష్‌లను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
Also Read:
భారత పర్యటనపై బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఐఏఎస్‌కు షాక్.. రూ.1.63 కోట్ల జరిమానా..