Kommareddy Pattabhiram: మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:20 PM
ఆరోగ్య శ్రీ ప్రారంభించినప్పుడు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా పీపీపీ చేశారని పట్టాభిరామ్ తెలిపారు. ఆయన చేసింది కూడా తప్పు అని చెబుతావా.. జగన్ అంటూ ప్రశ్నించారు.
అమరావతి: మాజీ సీఎం జగన్‌కు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. సిగ్గు లేకుండా పీపీపీపై అబద్ధాలు చెబుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనే 16 మెడికల్ హబ్‌లకు పీపీపీ టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు తానే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. జె టాక్స్‌కు భయపడి టెండర్లకు ఎవరూ రాలేదని విమర్శించారు. ఇప్పుడు పీ-4 పథకం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సీఎం చంద్రబాబు మీద నమ్మకం ఉంచారని అన్నారు.
ఆరోగ్య శ్రీ ప్రారంభించినప్పుడు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా పీపీపీ చేశారని పట్టాభిరామ్ తెలిపారు. ఆయన చేసింది కూడా తప్పు అని చెబుతావా.. జగన్ అంటూ ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యానికి ఒక్క పైసా ఖర్చు చేయని జగన్.. రిషికొండ ప్యాలెస్‌కి మాత్రం రూ. 500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. జగన్ చేసిన పాపాల వల్లనే ఈ పరిస్థితికి చేరుకున్నారని ఆరోపించారు. అది తెలుసుకుంటే మంచిదని పట్టాభిరామ్ హితవు పలికారు.
గత ప్రభుత్వంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రూ.500 కోట్ల అంచనా వేశారని పట్టాభిరామ్ గుర్తు చేశారు. కానీ ఖర్చు రూ.11.7 కోట్లు మాత్రమే అని విమర్శించారు. అలాగే ఉత్తరాంధ్ర నాలుగు మెడికల్ కాలేజీల అంచనా వ్యయం రూ.2100 కోట్లు.. అయితే ఖర్చు చేసింది కేవలం రూ.212 కోట్లు మాత్రమే అని ఆరోపించారు. జగన్ రేపు(గురువారం) నర్సీపట్నం వెళ్తారట.. మెడికల్ కాలేజీలను చూస్తారట.. అని చెప్పుకొచ్చారు. అక్కడున్నది ముళ్ల కంచలే కదా.. అక్కడకెళ్లి గంతులేస్తావా జగన్..అని పట్టాభి ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకుండా కుర్చీ కావాలని చిన్న పిల్లాడు లాలీపాప్ కోసం మారాం చేస్తున్నట్లు తన ప్యాలెస్‌లో కూర్చుని జగన్ డ్రామా ఆడుతున్నారని ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
ఇవి చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..