Home » Nobel Prize
జోయెల్ మోకిర్, పీటర్ హౌవిట్, ఫిలిప్ అఘియన్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లోనూ ఇప్పటికే ముగ్గురు చొప్పున నోబెల్ ఫ్రైజ్ వరించిన సంగతి తెలిసిందే.
నోబెల్ బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నేత మచాడోపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వామపక్ష భావజాలాన్ని వ్యతిరేకించే పాశ్చాత్య ధోరణికి ఆమె ఎంపిక నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి...
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 'మరియా కొరినా మచాడో'ను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమెకు ఎంత నగదు వస్తుంది, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉంటాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఇవాళ అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు.
నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఎవరిని వరిస్తుందా అన్నది ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నేటి ప్రకటనలో డోనాల్డ్ ట్రంప్ పేరు..
ఈ పురస్కారం తనకే దక్కాలన్న పట్టుదలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో ఇది మరింత ఆసక్తిగా మారింది.....
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు గాను నోబెల్ ఫ్రైజ్ లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్ యాఘీలకు నోబెల్ బహుమతిని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.
అమెరికాకు చెందిన ముగ్గురికి ఉమ్మడిగా భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు లభించాయి. జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్ లను ఈ ఏడాది బహుమతి వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది.