Share News

Nobel Peace Prize: ట్రంప్‌నకు శాంతి లేదా

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:36 AM

ఈ పురస్కారం తనకే దక్కాలన్న పట్టుదలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో ఇది మరింత ఆసక్తిగా మారింది.....

Nobel Peace Prize: ట్రంప్‌నకు శాంతి లేదా

  • అమెరికా అధ్యక్షుడికి నోబెల్‌ పురస్కారం దక్కే అవకాశాల్లేవనేది నిపుణుల అంచనా

  • నోబెల్‌ కమిటీ సమావేశాల్లో ఆయన పేరు చర్చకు వస్తుందా?

  • అనే విషయమ్మీద స్పష్టత కరువు

  • టంప్‌ వ్యక్తిగత రికార్డే మైనస్‌?

స్టావెంజర్‌ (నార్వే), అక్టోబరు 9: ఈ ఏడాది నోబల్‌ శాంతి బహుమతిని ఎవరికి ఇవ్వనున్నారు? ఈ పురస్కారం తనకే దక్కాలన్న పట్టుదలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో ఇది మరింత ఆసక్తిగా మారింది. నార్వే పార్లమెంటు కమిటీ నియమించిన ఐదుగురు సభ్యుల నోబెల్‌ కమిటీ రహస్య సమావేశాల్లో ట్రంప్‌ పేరు చర్చకు వస్తుందా? అనే విషయంపై స్పష్టత కరువైంది. గతంలో ఈ పురస్కారానికి ట్రంప్‌ అనేకసార్లు నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయెల్‌, పలు అరబ్‌ దేశాల మధ్య సంబంధాలను సాధారణస్థితికి తీసుకురావడంలో ట్రంప్‌ చేసిన కృషికిగాను ఆయన్ను 2025 సంవత్సరానికి నోబెల్‌ శాంతి పురస్కారం కోసం సిఫారసు చేస్తున్నట్లు గత డిసెంబరులో అమెరికా ప్రభుత్వ ప్రతినిధి క్లాడియా టెన్నీ ప్రకటించారు. నోబెల్‌ నామినేషన్లకు గత ఫిబ్రవరి 1వ తేదీతో గడువు ముగిసిన తర్వాత ట్రంప్‌ పేరును ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ, పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ నోబెల్‌ కమిటీకి సిఫారసు చేశారు. అయితే ఈసారి ఏడాది కూడా ఆయనకు శాంతి పురస్కారం లభించే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే శాంతి బహుమతి కోసం ఆయన నోబెల్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్‌-పాక్‌ యుద్ధం సహా ఏడు యుద్ధాలను తాను ఆపానని అనేకసార్లు చెప్పుకొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 05:36 AM