Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు తీవ్ర నిరాశ
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:58 PM
నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఇవాళ అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు.
నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నోబెల్ అవార్డు ట్రంప్‌ను వరించలేదు. కాసేపటి క్రితమే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన జరిగింది. మరియా కొరీనా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి-2025 గెలుచుకుంది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనెజులాకు చెందిన మరియా కొరీనా.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగాను ఈ పురస్కారం అందజేశారు. దీంతో ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం వరిస్తుందా? అనే అనుమానాలు పటాపంచలయ్యాయి.
నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఇవాళ అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ పలుమార్లు తాను ప్రపంచవ్యాప్తంగా కనీసం 8 యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. వీటిలో ఇజ్రాయెల్ - ఇరాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - రువాండా, కాంబోడియా - థాయిలాండ్, భారత్ - పాకిస్తాన్, సర్బియా - కోసోవో, ఈజిప్ట్ - ఎథియోపియా, అజర్బైజాన్ - అర్మేనియా, ఇటీవలి గాజా కాల్పుల విరమణ ఉన్నాయి.
నోబెల్ బహుమతికి నామినేషన్లు జనవరి 31తో ముగిశాయి. మొత్తం 338 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు గతేడాది నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Maria Corina Machado Wins Nobel Peace Prize: మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
CM Chandrababu Naidu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం..