Share News

Nobel Peace Prize 2025: నేటి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? కోటి కళ్లతో ఎదురుచూస్తున్న ట్రంప్

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:59 AM

నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఎవరిని వరిస్తుందా అన్నది ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నేటి ప్రకటనలో డోనాల్డ్ ట్రంప్ పేరు..

Nobel Peace Prize 2025: నేటి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? కోటి కళ్లతో ఎదురుచూస్తున్న ట్రంప్
Nobel Peace Prize 2025

ఇంటర్నెట్ డెస్క్: నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతి ఏడాదీ ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతిని మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే, ఈ ఏడాది ఈ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందోనన్న అంశం ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేడు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ అవార్డు ఇవాళే(అక్టోబర్ 10, 2025) ప్రకటిస్తున్న నేపథ్యంలో.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ అవార్డుపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. ఎందుకంటే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఈ అవార్డుపై తీవ్రమైన మోజు చూపించడమే కారణం.

పదే పదే డోనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగా అడుగుతున్నారు. తాను ఎనిమిది యుద్ధాల్ని ఆపానని, అందుకే తాను ఈ అవార్డుకు అర్హుడినని ట్రంప్ ఢంకా బజాయించి మరీ అడుగుతున్నారు.


అయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే, నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే నార్వేజియన్ నోబెల్ కమిటీ తన నిర్ణయాన్ని ఖరారు చేసినట్లు ధృవీకరించింది.


గాజాలో శాంతిని నెలకొల్పడానికి తానెంతో సహాయం చేశానని ట్రంప్ క్లైమ్ చేస్తున్నారు. అయితే, ట్రంప్ బహుమతిని గెలుచుకునే అవకాశాలు సున్నా అని నిపుణులు అంటున్నారు. కాగా, నోబెల్ శాంతి బహుమతి పట్ల ట్రంప్ ప్రేమ చాలా కాలంగా అందరికీ తెలుసు. 2020లో ట్రంప్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని అన్నారు. అయితే, ఇది అప్పుడు వరించకపోవడంతో అదే నోటితో.. ఈ అవార్డు మోసపూరితమైనదని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక, ఇప్పుడేమంటారో చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 12:07 PM