Share News

Nobel Prize in Economics 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ఈసారి ఎవరంటే..

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:41 PM

జోయెల్‌ మోకిర్‌, పీటర్‌ హౌవిట్‌, ఫిలిప్‌ అఘియన్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లోనూ ఇప్పటికే ముగ్గురు చొప్పున నోబెల్ ఫ్రైజ్ వరించిన సంగతి తెలిసిందే.

Nobel Prize in Economics 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ఈసారి ఎవరంటే..
Nobel economics winners 2025

ఆర్థిక శాస్త్రంలోనూ ముగ్గురికి నోబెల్‌ బహుమతి వరించింది. జోయెల్‌ మోకిర్‌, పీటర్‌ హౌవిట్‌, ఫిలిప్‌ అఘియన్‌ ఈ ఏడాదికి గానూ నోబెల్ సొంతం చేసుకున్నారు. భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో ఇప్పటికే ముగ్గురు చొప్పున నోబెల్ ఫ్రైజ్ వరించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3:15గంటలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుతులు పొందిన ముగ్గురి వివరాలను నోబెల్‌ ఫౌండేషన్‌ సభ్యులు వెల్లడించారు.


‘ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి’ని వెల్లడించినందుకు గాను జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియన్‌, పీటర్‌ హౌవిట్‌ నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.


కాగా, ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలందరి దృష్టి ‘స్వీడిష్ రిక్స్‌ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్’పైనే ఉంది. ఆరు రంగాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నోబెల్‌ ఫౌండేషన్‌ ప్రకటించే నోబెల్‌ బహుమతుల్లో ఆర్థిక శాస్త్రంలో పొందే నోబెల్‌ బహుమతిని అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తుంటారు.


ఇవి కూడా చదవండి..

ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 03:52 PM