ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maria Corina Reaction On Nobel Prize: శాంతి బహుమతిపై స్పందించిన మచాడో.. ట్రంప్‌పై ప్రశంసలు

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:33 PM

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కడంపై వెనెజుల ప్రతిపక్ష నేత మచాడో స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు.

maria corina machado

వెనెజులా,అక్టోబర్ 10: తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోపాటు వెనెజులా దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆ దేశ ప్రతిపక్ష నేత, హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడో వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని తనకు ఎంపిక చేయడంపై శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా మచాడో స్పందించారు. తన ఉద్యమానికి ట్రంప్ మద్దతు ఇస్తున్నందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ క్రమంలోనే ఈ పురస్కారాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

తనను నోబెల్ శాంతి బహుమతి వరించడం పట్ల వెనెజులా ప్రతిపక్ష నేత, హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడో శుక్రవారం స్పందించారు. ఈ శాంతి బహుమతిని అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోపాటు వెనెజులా ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. వెనెజులా ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించడం తమ పోరాటం ముగింపునకు ఊతమిస్తుందన్నారు. అలాగే స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

గతంలో కంటే అధికంగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్, లాటిన్ అమెరికా ప్రజలపై ఆధారపడతామని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు తమకు ప్రధాన మిత్రులను ఈ సందర్భంగా మచాడో వివరించారు. అయితే ఈ పురస్కారం తనకు దక్కడం నిజంగా నమ్మలేకపోతున్నానన్నారు. మాట్లాడేందుకు మాటలు సైతం రావడం లేదని తెలిపారు.

తాము సాధించాల్సింది చాలా ఉందని చెప్పారు. అందుకోసం కృషి చేస్తున్నామని.. అందులో తప్పక విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ గెలుపు తన ఒక్కదానిదే కాదని.. అందరిది అని ఈ సందర్భంగా మచాడో ప్రకటించారు. వెనెజులా ప్రజల తరఫున నోబెల్ కమిటీకి మచాడో ధన్యవాదాలు తెలిపారు. అయితే మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తూ నార్వేజియన్ కమిటీ.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి

మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్

Read Latest International News and Telugu News

Updated Date - Oct 10 , 2025 | 09:41 PM