Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:39 PM
బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్.. మైక్రోసాఫ్ట్ సలహాదారుగా సేవలందించనున్నారు. ఏఐ సంస్థ అంత్రోపిక్‌కు కూడా సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు గాను ఆయన పారితోషికం కూడా తీసుకోనున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన టెక్ రంగం వైపు మళ్లడం ఇదే తొలిసారి.
ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఏఐ సంస్థ ఆంత్రొపిక్‌కు కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఏఐ రంగంలో రెండు సంస్థలకు మార్గనిర్దేశనం చేసినందుకు గానూ పారితోషికం కూడా తీసుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. టెక్ రంగంవైపు రిషి సునాక్ మళ్లడం ఇదే తొలిసారి. ఇక రిషి సునాక్ నియామకానికి బ్రిటన్‌కు చెందిన అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ (ఏసీఓబీఏ) అనుమతించింది. బ్రిటన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 2023లో ఏఐ భద్రతకు సంబంధించి గ్లోబల్ సమావేశాన్ని నిర్వహించారు (Rishi Sunak As Microsoft, Anthropic Advisor).
ఇక బ్రిటన్ ప్రధానిగా సేవలందించినందుకు రిషి సునాక్ విధులకు సంబంధించి ఏసీఓబీఏ పలు నిబంధనలు విధించింది. వీటి ప్రకారం, ఆయన మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ తరఫున బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు, లాబీయింగ్ వంటివి చేయకూడదు. బ్రిటన్ ప్రధానిగా చేసిన సమయంలో తనకు తెలిసిన కీలక సమాచారాన్ని ప్రస్తుత విధుల్లో వినియోగించకూడదు. బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని మైక్రోసాఫ్ట్ లేదా ఆంత్రోపిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. బ్రిటన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు ప్రైవేటు రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది.
ఇవి కూడా చదవండి:
మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డపై నుంచి పాక్‌కు అప్ఘాన్ మంత్రి వార్నింగ్
భారతీయ స్టూడెంట్ రాకపోతే మన భవిష్యత్తుకు ఇబ్బందే.. అమెరికా బిలియనీర్ హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి