ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nicolas Maduro: ఇతడ్ని అప్పగిస్తే రూ. 430 కోట్లు బహుమతి

ABN, Publish Date - Aug 08 , 2025 | 03:48 PM

అతడ్ని అరెస్టు చేయిస్తే ఏకంగా రూ. 430 కోట్లు ముట్టజెబుతామని అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశంలో డ్రగ్స్ సరఫరాకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కారణమని భావిస్తున్న అమెరికా ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది.

Nicolas Maduro

ఇంటర్నెట్ డెస్క్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రేటును పెంచుకుంటూ పోతోంది అగ్రరాజ్యం అమెరికా. మదురో అరెస్టుకు అవసరమైన సమాచారం ఇచ్చినవారికి ఇప్పుడు ఏకంగా 50 మిలియన్‌ డాలర్లు (రూ. 430 కోట్లు) ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్‌'లో ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మదురోపై 15 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్‌ ప్రభుత్వం దానిని 25 మిలియన్‌ డాలర్లకు పెంచింది. అది కాస్తా ఇప్పుడు ట్రంప్ రెండో సారి అధ్యక్షుడయ్యాక ఈ రేటు 50 మిలియన్ డాలర్లకు చేరింది.

ఎందుకీ వేట.. అనే విషయానికి వస్తే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కొన్నేళ్లుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా మారారు. అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్‌ మదురో కుట్రలు చేస్తున్నారన్నది అమెరికా వాదన. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ మదురోకు సంబంధించిన 700 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది. వీటిల్లో మదురోకు చెందిన ప్రైవేట్‌ జెట్‌లు, తొమ్మిది వాహనాలు ఉన్నాయి. ట్రంప్‌ నాయకత్వం నుంచి మదురో ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని బాండీ అంటున్నారు.

కాగా, నికోలస్ మాదురోను అరెస్ట్ చేయిస్తే, 50 మిలియన్ డాలర్ల బహుమతి అంటూ అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ చేసిన ప్రకటనను వెనిజులా విదేశాంగ మంత్రి య్వాన్ గిల్ అవహేలన చేశారు. అటు, సోషల్ మీడియాలోనూ బాండీ ప్రకటనపై సైటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నికోలస్ వెనిజులా లోనే ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అటు, అమెరికా - వెనిజులా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మదురోకు కేవలం కొకైనే కాకుండా ఫెంటెనిల్‌ స్మగ్లింగ్‌తో కూడా సంబంధాలున్నాయని అమెరికా అంటోంది. ఇప్పటికే 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌లో కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు

Updated Date - Aug 08 , 2025 | 04:03 PM