Israel PM - Gaza: పని పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని
ABN, Publish Date - Aug 10 , 2025 | 10:20 PM
గాజాను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. హమాస్‌ను గాజాకు విముక్తి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: హమాస్‌తో యుద్ధంపై తాజాగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తమకు మొదలెట్టిన పనిని పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు. హమాస్‌ను పూర్తిగా తుదముట్టించాల్సిందేనని స్పష్టం చేశారు. జెరూసలెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
‘మా లక్ష్యం గాజాను ఆక్రమించుకోవడం కాదు. గాజాకు విముక్తి కల్పించడం’ అని వ్యాఖ్యానించారు. గాజాలో తదుపరి చర్యలపై చాలా స్వల్ప కాలిక ప్రణాళిక ఉందని అన్నారు. అయితే, ఇజ్రాయెల్‌పై ప్రపంచస్థాయిలో జరుగుతున్న దుష్ప్రచారానికి విరుగుడు కూడా తమ వద్ద ఉందని అన్నారు. గాజాలో సైన్యం తొలగింపు, సెక్యూరిటీ బాధ్యతలు ఇజ్రాయెల్‌కు బదలాయింపు తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. పౌర పాలన కోసం ఇజ్రాయెల్ యేతరులకు అప్పగిస్తామని కూడా చెప్పారు.
గాజా పరిస్థితులను పరిశీలించేందుకు మరింత మంది ఫారిన్ జర్నలిస్టులను ఆహ్వానించాలని మిలిటరీకి చెప్పినట్టు నేతన్యాహూ తెలిపారు. ఇప్పటివరకూ కేవలం ఇజ్రాయెల్ సైనికులు ఉన్న ప్రాంతాలకు విదేశీ జర్నలిస్టులను పరిమితం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
గాజాలో నెలకున్న అనేక సమస్యలకు హమాస్ మిలిటెంట్ గ్రూపే కారణమని మరోసారి ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు.
గాజాలో మిలిటరీ చర్చలను మరింత విస్తరించేందుకు ప్రధాని నేతన్యాహూ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ జరిగిన నిరసనల్లో సుమారు 26 పాలస్తీనియన్లు మరణించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ గాజాలో సుమారు 40 వేల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నప్పటికీ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మిలిటరీ చర్యలు అవసరమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో..
మరో బ్రిటన్ ఎఫ్-35 విమానంలో సాంకేతిక సమస్య.. జపాన్‌లో అత్యవసర ల్యాండింగ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 11 , 2025 | 10:39 PM