ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Israel PM Cancels India Visit: భారత పర్యటన రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని.. కారణమిదే.?

ABN, Publish Date - Nov 25 , 2025 | 12:29 PM

ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దవడం ఇది మూడోసారి.

Isreal PM Netanyahu

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి రద్దైంది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల ఘటనే దీనికి కారణమని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పర్యటన రద్దైనట్టు సమాచారం. ఇలా ఈ ఏడాదిలో మూడోసారి తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారాయన.

నెతన్యాహు.. చివరిసారిగా 2018లో భారత్‌కు విచ్చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది పర్యటించాలనుకోగా.. పలు కారణాలతో రద్దవుతూనే ఉంది. సెప్టెంబర్ 9వ తేదీనే ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. అయితే.. అక్కడ బిజీ షెడ్యూల్ ఉండటంతో రాలేకపోయారు. తాజాగా డిసెంబర్ నెలలో ప్రధాని మోదీతో సమావేశం కావాల్సి ఉండగా.. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా మరోసారి రద్దైంది. ఇక ఈ ఏడాది ఆయన.. భారత్‌లో పర్యటించే అవకాశాలు సన్నగిల్లాయి. 2026లో ఆ దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

భారత ప్రధాని మోదీ.. 2017లో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2018 జనవరిలో నెతన్యాహు భారత్‌ను సందర్శించారు. దీంతో ఇరు దేశాల ప్రధానుల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

క్రిప్టో పెట్టుబడులతో నష్టాలు.. ట్రంప్‌ కుటుంబ ఆస్తుల విలువ ఢమాల్

అరుణాచల్ మాదే.. భారత పాస్‌పోర్టు చెల్లదు.. భారతీయురాలికి చైనాలో వేధింపులు

Updated Date - Nov 25 , 2025 | 12:41 PM