ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nepal Finance Minister: నడిరోడ్డుపై ఆర్థిక మంత్రిని చితకబాదిన యువకులు..

ABN, Publish Date - Sep 09 , 2025 | 07:20 PM

ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించినా... ఆ దేశ యువకుల్లో ఆగ్రహం మాత్రం చల్లారలేదు. దీంతో ఆర్థిక మంత్రిని రోడ్లపై వెంటపడి మరీ తరిమితరిమి కొట్టారు.

Bhanu Prasad Paudel

కఠ్మాండూ, సెప్టెంబర్ 09: ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించినా... ఆ దేశ యువకుల్లో ఆగ్రహం మాత్రం చల్లారలేదు. మంగళవారం నాడు మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ నివాసాన్ని వారంతా చుట్టుముట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో ఆయన భార్య సైతం అగ్నికి ఆహుతి అయ్యారు. ఇక ఆర్థిక మంత్రి భాను ప్రసాద్ పాడేల్‌ను కాఠ్మాండూ నగర వీధుల్లో పరిగెత్తించి.. పరిగెత్తించి.. మరీ ఆయనపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దేశంలో సోషల్ మీడియా సేవలను నిలిపివేయడం, ప్రభుత్వంలో అవినీతి పెచ్చురిల్లడం, బంధు ప్రీతి అంతకంతకు పెరిగిపోవడం నేపాల్ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ క్రమంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయాలని, అవినీతిని అరికట్టాలంటూ నేపాల్ దేశవ్యాప్తంగా యువకులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు అరికట్టేందుకు ఆర్మీని ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ సందర్భంగా యువకుల నిరసనలు అరికట్టే క్రమంలో ఆర్మీ భాష్ప వాయు గోళాలను ప్రయోగించింది. అలాగే ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లను వినియోగించింది. దీంతో బాలుడితో సహా 22 మంది మరణించారు.

ఈ నేపథ్యంలో సోమవారం నేపాల్ హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయినా.. యువకుల్లో ఆగ్రహం మాత్రం చల్లార లేదు. దీంతో మంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అయినా వారి కోపం మాత్రం తీరలేదు. ఈ మేరకు ఆర్థికమంత్రిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. పరిగెడుతున్నా వదిలిపెట్టకుండా వెంటపడి మరీ ఎగిరెగిరి తన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పిడుగులతో పాటు భారీ వర్షాలు..

నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More International News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 08:11 PM