Asim Munir: తీరుమారని పాక్ ఆర్మీ చీఫ్.. మళ్లీ అణు బెదిరింపు వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 18 , 2025 | 05:03 PM
కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్‌పై విషం కక్కారు.
ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో తోక ముడిచిన పాక్ ఇప్పటికీ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఓవైపు అఫ్గనిస్థాన్ తాలిబన్లు ముచ్చెమటలు పట్టిస్తున్నా, సొంతింట్లో తిరుగుబాట్ల కుంపటి రగులుతున్నా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) తాజాగా మరోసారి భారత్‌ను అణ్వాయుధాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశారు.
కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్‌పై విషం కక్కారు. భారత్ నుంచి రెచ్చగొట్టే చర్యలు చిన్నగా ఉన్నా పాకిస్థాన్ ఊహించని విధంగా నిర్ణయాత్మకమైన జవాబు ఇస్తుందని అన్నారు. పాక్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని, భారత భౌగోళిక భద్రతను దెబ్బతీయగలమని అన్నారు. యుద్ధం తర్వాత పరిణాలకు భారత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంపై ఉగ్రదాడికి ముందుకూడా ఆయన కశ్మీర్ తమ 'జీవనాడి' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత బలగాలు పాక్ లోపలకు చొచ్చుకెళ్లి 9 ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఇవి కూడా చదవండి..
డోస్ పెంచిన ట్రంప్.. 9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..
అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 18 , 2025 | 05:08 PM