Mexico President: దేశాధ్యక్షురాలికి, నడిరోడ్డు మీద.. పబ్లిగ్గా లైంగిక వేధింపులా?
ABN, Publish Date - Nov 07 , 2025 | 11:09 AM
ఇంత దారుణమా..? సాక్షాత్తూ దేశాధ్యక్షురాలికి.. పబ్లిగ్గా లైంగిక వేధింపులా? సభ్యసమాజం నివ్వెరపోయేలా ఉంది ఈ ఘటన. మెక్సికో అధ్యక్షురాలిపై జరిగిన ఈ నీచమైన పని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు.. గళమెత్తుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంత దారుణమా..? సాక్షాత్తూ దేశాధ్యక్షురాలికి.. నడిరోడ్డు మీద, పబ్లిగ్గా లైంగిక వేధింపులా? అవును.. ఇలానే అనుకోవాల్సి వస్తోంది ఆ వీడియో చూస్తే.. ప్రపంచ యావత్ సభ్యసమాజం నివ్వెరపోయేలా ఉంది ఈ ఘటన. మెక్సికో దేశంలో జరిగిన ఈ నీచమైన పని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు గళమెత్తుతున్నారు.
ఇక, విషయంలోకి వెళ్తే, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మంగళవారం (నవంబర్ 4) నేషనల్ ప్యాలెస్ నుండి విద్యా మంత్రిత్వ శాఖకు నడుచుకుంటూ వెళుతున్నారు. మార్గ మధ్యలో తనకోసం వేచి ఉన్న సందర్శకులతో ముచ్చటిస్తున్నారు. అయితే, ఆమె పక్కకు వచ్చిన ఒక వ్యక్తి ఆమె భుజంపై చేయివేసి ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, మరో నీచమైన పనికి పూపుకోబోయాడు. ఒక వ్యక్తి మెక్సికో ప్రెసిడెంట్ షీన్‌బామ్‌ను తాకి ముద్దు కోసం వంగి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపించింది.
షీన్‌బామ్ ఆ వ్యక్తి చేతుల్నినెట్టి తన నడక కొనసాగించారు. తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారని మెక్సికో నగర మేయర్ క్లారా బ్రుగాడా తెలిపారు. ఈ విషయంపై షీన్ బామ్ స్పందించారు. 'మెక్సికో నేషనల్ ప్యాలెస్ సమీపంలో తనను వేధించిన వ్యక్తిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ దాడి దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న రోజువారీ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది' అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 07 , 2025 | 11:22 AM