Share News

Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:04 AM

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై శుక్రవారం రెండవరోజు విచారణ జరుగనుంది. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను విచారించారు. నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీలను స్పీకర్ విచారించనున్నారు.

Investigation of defecting MLAs: ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Investigation of defecting MLAs

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై శుక్రవారం రెండవరోజు విచారణ జరుగనుంది. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను విచారించారు. నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీలను స్పీకర్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. ఎమ్మెల్యే పోచారంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన జగదీశ్ రెడ్డిని పోచారం తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.


మధ్యాహ్నం 12 గంటలకు అరికపూడి గాంధీ Vs కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది. గాంధీపై కల్వకుంట్ల సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన కల్వకుంట్ల సంజయ్‌ను గాంధీ తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 12, 13 తేదీలలో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. అయితే ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఈ అంశంపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగియడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్

TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం

Updated Date - Nov 07 , 2025 | 08:04 AM