ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Plane Crash In Mexico: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి

ABN, Publish Date - Dec 16 , 2025 | 01:20 PM

మెక్సికో దేశంలో ఘరో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ విమానం కూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Plane Crash In Mexico

ఇంటర్నెట్‌డెస్క్‌: మెక్సికో(Mexico)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫ్లైట్ ల్యాండింగ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో సాకర్ మైదానంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందారు(Plane Crash In Mexico).

మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న టోలుకా ఎయిర్‌పోర్ట్‌(Toluca airport)కు పరిసర ప్రాంతమైన శాన్‌మాటియో అటెన్కో(San Mateo Atenco)లో ఓ చిన్న ప్రైవేట్ విమానం కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. మెక్సికో తీరం వెంబడి ఉన్న అకాపుల్కో నుంచి 8 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ఫ్లైట్ బయల్దేరింది. సాకర్ మైదానంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో సమీపంలోని ఓ వ్యాపార సంస్థ మెటల్ పైకప్పును ఢీకొట్టింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే.. ప్రమాదం అనంతరం 7 మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేపట్టారన్నారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగడంతో సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

రోడ్డుపై బస్సుల్లో మంటలు.. పలువురు సజీవ దహనం.!

చిన్నారిపై హత్యాచారం కేసు.. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ

Updated Date - Dec 16 , 2025 | 02:50 PM