UP Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి.!
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:03 AM
ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని సమీపంలో ఒకేసారి నాలుగు బస్సుల్లో మంటలు అంటుకుని నలుగురు మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మధుర(Madhura)లోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారి(Delhi Agra Express Highway)పై మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరిందని, పదుల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పొగ మంచు కారణంగా ఒకేసారి 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఏకకాలంలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. అధికారులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి(UP Bus Fire).
ఇవీ చదవండి: