Pakistan: లష్కరే టాప్ కమాండర్ హతం.. ఇండియాలో పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం..
ABN, Publish Date - May 18 , 2025 | 07:09 PM
లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్‌మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు.
ఇస్లామాబాద్: పాక్ కేంద్రస్థానంగా పనిచేసే లష్కరే తొయిబా (Lashkar-e-Taibe) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబు సైఫుల్లా (Abu Saifullah) ఆదివారం నాడు హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్‌మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు.
IMF Conditions Pakistan: భారత్ ఆందోళన పర్యవసానం.. పాక్‌కు రుణాలపై ఐఎంఎఫ్ కొత్తగా 11 షరతులు
భారత్‌లో జరిగిన పలు కీలక ఉగ్రదాడుల్లోనూ సైఫుల్లా కీలకంగా వ్యహరించాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)పై 2001లో జరిగిన దాడికి సైఫుల్లా వ్యూహరచన చేశాడు. 2008లో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనకూ ప్లాన్ చేసినది ఇతనే. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) వద్ద జరిగిన బాంబు పేలుడుతోనూ సైఫుల్లాకు సంబంధం ఉంది.
కాగా, నేపాల్‌లో లష్కరే కీలక మాడ్యూల్‌గా సైఫుల్లా వ్యవహరించే వాడు. పోరస్ ఇండో-నేపాల్ సరిహద్దు గుండా టెర్రరిస్టులను భారత భూభాగంలోకి పంపేందుకు మార్గం సుగమం చేసేవాడు. లష్కరే తొయిబా, దాని పొలిటికల్ ఫ్రండ్ జమాత్ ఉద్ దవా (జేయూడీ)కి ఫండ్‌రైజర్‌గా వ్యవహరించేవాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్ బదిన్ జిల్లా మాట్లి తాలూకాలో ఆదివారం నాడు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో సైఫుల్లా హతమవడంతో లష్కరేకి గట్టి దెబ్బే తగిలినట్టయింది.
ఇవి కూడా చదవండి..
Erdogan Powerplay: తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..
Navy Ship Video: బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నేవీ షిప్.. వీడియో చూస్తే మైండ్‌బ్లాంక్
Updated Date - May 18 , 2025 | 09:00 PM