Australia: ఆస్ట్రేలియాలో భారతీయుల స్వాతంత్ర్య వేడుకలను అడ్డుకున్న ఖలిస్థానీలు
ABN, Publish Date - Aug 15 , 2025 | 02:57 PM
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు.
మెల్‌బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు 79వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్నారు. ఆస్ట్రేలియా (Australia) లోని మెల్‌బోర్న్‌లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంలోనూ వేడుకలకు సిద్ధం కాగా కొందరు ఖలిస్థానీలు అక్కడకు చేరుకుని ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' నినాదాల మధ్య కాన్సులేట్ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
అస్ట్రేలియాలోని బోరోనియాలో ఇటీవల స్వామి నారాయణన్ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసారు. ఆసియన్లు నడిపే రెస్టారెంట్లపైనా ఇలాంటి రాతలే కనిపించాయి. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Shehbaz Sharif: 4 రోజుల్లో భారత్ అహాన్ని అణిచివేశాం
US Warns India of Higher Tariffs: పుతిన్, ట్రంప్ భేటీ విఫలమైతే.. భారత్‌పై మరిన్ని సుంకాలు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 15 , 2025 | 02:57 PM