ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indonesia bus accident: ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

ABN, Publish Date - Dec 22 , 2025 | 10:04 AM

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Indonesia Bus Accident

ఇండోనేషియా(Indonesia)లోని సెంట్రల్ జావా ప్రాంతంలో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున సెమరాంగ్ నగరం(Semarang City)లోని క్రాప్యాక్ టోల్ గేట్ (Toll gate)వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు (Bus) ఘోర ప్రమాదాని (Accident)కి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

ప్రమాదం జరిగే సమయానికి బస్సు అత్యంత వేగంగా వెళ్తోందని స్థానిక అధికారులు తెలిపారు. క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది. చాలా మంది బాధితులు బస్సు లోపలే ఇరుక్కుపోయారని, కిటికీ అద్దాలు పగిలి లోపలికి వెళ్లడానికి రెస్క్యూ టీమ్ ఇబ్బంది పడుతుందని అధికారి తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

రైలు టికెట్ల ధరల పెంపు!

బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు

Updated Date - Dec 22 , 2025 | 11:49 AM