ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H-1B Visa Issues: హెచ్ 1బీ వీసా కొత్త రూల్..హెల్ప్ లైన్ నంబర్ ప్రకటించిన భారత రాయబార కార్యాలయం

ABN, Publish Date - Sep 21 , 2025 | 07:24 AM

H-1B వీసాలపై ఏడాదికి $100,000 ఫీజు విధించే అమెరికా కొత్త నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం భారతీయ టెక్ నిపుణులపై ప్రభావం చూపనుంది. అయితే దీనిపై యూఎస్ అధికారులు క్లారిటీ ఇవ్వగా, భారత రాయభార కార్యాలయం హెల్ప్ లైన్ ప్రకటించింది.

H-1B Visa Issues

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వీసా కొత్త రూల్ (Proclamation) నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో H-1B వీసా మీద కొత్తగా $100,000 (ఒక లక్ష డాలర్ల) ఫీజు విధిస్తున్నట్టు తెలిపారు. ఇది ప్రధానంగా భారతీయులకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, అమెరికాలో H-1B వీసాలు ఎక్కువగా భారతీయ టెక్నీషియన్లు, ఇంజినీర్లకు ఉన్నాయి. మొత్తం H-1B వీసాల్లో 71-72 శాతం భారతీయులకే దక్కుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్

ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం ఒక అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. ఈ నంబర్ ద్వారా తక్షణ సహాయం కావాల్సిన భారతీయులు (H-1B Visa Issues) సంప్రదించవచ్చు.+1-202-550-9931 (ఫోన్ & వాట్సాప్). ఈ నంబర్ సాధారణ కాన్సులర్ సేవల కోసం కాదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ నంబర్ ఉపయోగించాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

కొత్త ఫీజు గురించి క్లారిఫికేషన్

  • కొత్త ఆదేశంపై భారతీయులపై అనేక సందేహాలు వస్తున్నాయి. వీటిపై అమెరికా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) క్లారిటీ ఇచ్చింది.

  • ఈ $100,000 ఫీజు కొత్త H-1B వీసా దరఖాస్తుదారులకే వర్తిస్తుందని తెలిపింది

  • ఈ ఫీజు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందీ కాదు. ఇది ఒక సారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు

  • ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా కొత్త వీసా పొందినవారికి ఈ ఫీజు వర్తించదు

  • ఈ ఫీజు వీసా రీన్యువల్ (పునరుద్ధరణ) పై కూడా వర్తించదు

  • ప్రస్తుతం H-1B వీసా కలిగిన వారు అమెరికా బయట ఉన్నా, తిరిగి దేశంలోకి రాకున్నా కూడా ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

  • ఈ $100,000 ఫీజు వీసా దరఖాస్తుపై ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది కొత్త వీసాలు పొందుతున్నవారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందన

ఈ కొత్త నిబంధనపై భారత విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా H-1B వీసా కార్యక్రమంపై ప్రతిపాదిత ఆంక్షలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాము. భారతీయ పరిశ్రమ కూడా ఈ నిబంధనలకు సంబంధించి కొన్ని అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 07:45 AM