ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

ABN, Publish Date - May 24 , 2025 | 09:33 AM

India slams Pakistan at UN: ఉగ్రవాదం అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌ను భారత్ తీవ్రంగా మందలించింది. 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో పర్యాటకుల హత్య చేసింది పాక్ ఉగ్రవాదులేనని విరుచుకుపడింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామమని పేర్కొంది.

India slams Pakistan at UN

India Pakistan UN Speech: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో భారతదేశం పాకిస్థాన్‌పై ద్వారా విరుచుకుపడింది. గతనెల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో తప్పుడు ప్రచారం మొదలెట్టిందని తీవ్రంగా విమర్శించింది. "ప్రపంచ ఉగ్రవాద కేంద్రం" గా ఉన్న పాకిస్థాన్‌కు ఉగ్రవాదంపై ప్రసగించడం సిగ్గుచేటని.. వారికి ఆ హక్కే లేదని ఎండగట్టింది. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదని భారత్ పేర్కొంది. పాకిస్థాన్ ఈ చర్చల్లో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానకరమని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానించారు.


UN లో పాక్‌ తీవ్ర వ్యాఖ్యలు..

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పౌరుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో పాక్‌ రాయబారి అ‌సిమ్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. "నీరు జీవనానికి ఆధారం. యుద్ధానికి ఆయుధం కాదంటూ" ప్రసంగంలో వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ.. దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాద్‌పై విరుచుకుపడ్డారు.


ఉగ్రవాదులు 20 వేల మందిని చంపారు..

"భారతదేశం దశాబ్దాలుగా పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రసంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోంది. అది ముంబైలో 26/11 దాడి అయినా, 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో అమాయక పర్యాటకుల ఊచకోత అయినా సరే. వారి లక్ష్యం ఎల్లప్పుడూ సాధారణ పౌరులే" యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఇప్పటివరకూ ఉగ్రవాదుల వల్ల 20 వేల మందికి పైగా పౌరులు అన్యాయంగా చనిపోయారని ఆరోపించారు. అటువంటి దేశం పౌరుల భద్రత గురించి మాట్లాడటం అంతర్జాతీయ సమాజం ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టే" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. "ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా" ఉన్న పాకిస్థాన్‌ సరిహద్దు ఉగ్రవాదానికి మద్ధతు ఇచ్చినంత వరకూ.. సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.


ఆపరేషన్ సిందూర్ పై ఏమన్నారంటే..

ఆపరేషన్ సిందూర్ వల్ల మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్‌ ప్రభుత్వం, పోలీసులు, సైనిక అధికారులు హాజరైన విషయాన్ని కూడా భారతదేశం UN లో ప్రస్తావించింది. ఆ దేశం ఉగ్రవాదులు, సాధారణ పౌరులను ఒకేలా చూస్తుందనేందుకు ఈ సంఘటనను ఉదాహరణగా పేర్కొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్థాన్‌ పౌరులను కవచంగా ఉపయోగించుకోవడాన్ని మేము చూశామని యూఎన్ భారత శాశ్వత ప్రతినిధి హరీష్ అన్నారు.


ఇవీ చదవండి

మానవత్వం మరిచిన పాక్.. 220 మంది ప్రాణాలతో చెలగాటం..

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 11:00 AM