MEA: ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదు: చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ
ABN, Publish Date - Dec 31 , 2025 | 01:56 PM
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తిరస్కరించింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా(China) విదేశాంగ మంత్రి వాంగ్ యి(Wang Yi) బీజింగ్(Beijing)లో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ఈ క్రమంలో మే నెలలో భారత్-పాక్(India-Pak) మధ్య తలెత్తిన ఉద్రిక్తలను తగ్గించడానికి తాము మధ్యవర్తిత్వం(Mediation) మహించామని వాంగ్ యి పేర్కొన్నారు. ఒక్క భారత్-పాక్ మాత్రమే కాదు.. ఇరాన్, పాలస్తీనా-ఇజ్రాయెల్, మయన్మార్ వివాదాల్లోనూ తాము జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పామని చెప్పుకొచ్చారు. అయితే.. చైనా వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చినట్టు సమాచారం.
మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటి నుంచో స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదు. పాకిస్థాన్ (Pakistan) సైనిక అధికారులు (DGMOs) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమే. ఇందులో ఎవరూ మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు.
పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలను కేవలం ద్వైపాక్షికం(Bilateral)గా మాత్రమే పరిష్కరించుకుంటామని.. మధ్యవర్తిత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని కేంద్రం పునరుద్ఘాటించింది. చైనా ఓ వైపు శాంతి నెలకొల్పాలని చెబుతూనే, మరోవైపు పాకిస్థాన్‌కు సైనిక సహాయం, నిఘా సమాచారాన్ని అందిస్తూ ‘ద్వంద్వ నీతి’ ప్రదర్శించిందని భారత అధికారులు తీవ్రంగా విమర్శించారు. గతంలో మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దానికి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..
Updated Date - Dec 31 , 2025 | 02:03 PM