ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Russia Jobs: భారతీయులకు రష్యాలో వేల ఉద్యోగాలు.. డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందం..

ABN, Publish Date - Nov 11 , 2025 | 08:38 AM

రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించబోతున్నారు.

India Russia workforce pact

రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కార్మికుల మార్పిడికి సంబంధించి కీలక ఒప్పందం జరగనుందట (India Russia labour mobility agreement).

రష్యాలో భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణులు, కార్మికుల కొరత ఏర్పడింది. రష్యా కార్మిక శాఖ నిర్దేశించే కోటాల ప్రకారం ఆయా పరిశ్రమల్లో భారతీయులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించబోతున్నాయట. ఈ మేరకు రెండు దేశాల మధ్య డిసెంబర్‌లో ఒప్పందం కుదరబోతోందట. గతంలో కూడా రష్యాలో భారతీయులు పలు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందారు. అయితే భారతీయులను ఉద్యోగాల పేరుతో రష్యాలో మోసగించిన ఘటనలు అనేకం జరిగాయి (Indian skilled workers Russia).

అలాంటి మోసాలను నివారించేందుకు తాజా ఒప్పందంలో తగు చర్యలు తీసుకోబోతున్నారట (Putin India visit December). భారతీయ నిపుణులు, ఉద్యోగులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తారట. న్యాయంగా, సక్రమంగా నియామకాలు జరిగేలా చూస్తారట. అంతేకాదు భారతీయ కార్మికులకు రష్యన్ భాష కూడా నేర్పించబోతున్నారట. ఇందుకోసం తగు చర్యలు తీసుకుంటున్నట్టు రష్యాలోని ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు మనోజ్ కొట్వానీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 08:38 AM