ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bill Gates Epstein link: ఎప్‌స్టీన్ ఫైల్స్.. బిల్ గేట్స్, నోమ్ చోమ్స్కీ ఫొటోలు విడుదల..

ABN, Publish Date - Dec 19 , 2025 | 04:19 PM

ఎప్‌స్టీన్‌తో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ, బిజినెస్ నిపుణులు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారంటూ పలు ఆధారాలు బయటపడుతున్నాయి. యూఎస్ హౌస్ డెమొక్రాట్లు ఎప్‌స్టీన్‌కు ఎస్టేట్ నుంచి తాజాగా కొన్ని కొత్త ఫొటోలను విడుదల చేశారు

Epstein scandal

అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఎప్‌స్టీన్‌తో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ, బిజినెస్ నిపుణులు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారంటూ పలు ఆధారాలు బయటపడుతున్నాయి. యూఎస్ హౌస్ డెమొక్రాట్లు ఎప్‌స్టీన్‌కు ఎస్టేట్ నుంచి తాజాగా కొన్ని కొత్త ఫొటోలను విడుదల చేశారు (Epstein estate images).

కొత్తగా విడుదల చేసిన ఫొటోల్లో పలు దేశాల పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు పత్రాల స్క్రీన్ షాట్లు ఉన్నాయి. అయితే వాటిల్లోని వ్యక్తిగత వివరాలు కనిపించకుండా బ్లర్ చేశారు. ఆ పాస్‌పోర్ట్‌లు ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన అమ్మాయిలవి కావడం విశేషం. ఇక, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రొఫెసర్, మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న నోమ్ చోమ్స్కీ ఫొటోలు బయటపడడం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్‌తో కలిసి నోమ్ చోమ్స్కీ విమానంలో కలిసి కూర్చున్నట్టు ఓ ఫొటో బయటకు వచ్చింది (Noam Chomsky Epstein controversy).

అలాగే ప్రముఖ వ్యాపారవేత్త బిల్‌గేట్స్ ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో కూడా విడుదల అయింది. అయితే ఆ ఫొటోలో అమ్మాయి మొహం బ్లర్ అయి ఉంది. అయితే ఈ ఫొటోలు చట్ట వ్యతిరేకరమైనవిగా, నేరపూరితమైనవిగా లేవు. అయితే ఒక ఛాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లో మాత్రం అమ్మాయిల పంపిణీ గురించిన సమాచారం ఉంది. 'నాకు ఒక ఫ్రెండ్ స్కౌట్ ఉంది. ఆమె ఈరోజు నాకు కొంతమంది అమ్మాయిలను పంపింది. కానీ ఆమె ఒక్కో అమ్మాయికి 1000 డాలర్లు అడుగుతోంది. నేను ఇప్పుడు మీకు ఆ అమ్మాయిలను పంపుతాను. బహుశా ఎవరైనా 'జే' కి మంచిగా ఉంటారేమో' అని ఉంది (Epstein scandal latest).

ఆ ఛాట్ ఎవరు, ఎవరికి పంపారనే విషయంలో క్లారిటీ లేదు (high-profile names Epstein). అలాగే ఆ ఛాట్‌లోని జే అంటే ఎవరో కూడా బయటకు రాలేదు. కాగా, గత నెలలో ద్వైపాక్షిక మద్దతుతో ఆమోదం పొందిన ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఎప్‌స్టీన్‌తో డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా సాన్నిహిత్యం ఉందని ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి.

ఇవీ చదవండి:

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్‌ సతమతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2025 | 04:19 PM