Aishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భగవద్గీత శ్లోకంతో మెరిసిన ఐశ్వర్య..
ABN, Publish Date - May 23 , 2025 | 01:36 PM
ఫ్రాన్స్‌లో ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అందాల తార ఐశ్వర్య రాయ్ మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు.
78th Cannes Film Festival 2025 Aishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అందాల తార ఐశ్వర్య రాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మొదటి రోజన రెడ్ కార్పెట్‌పై చీరలో తళుక్కుమన్నారు. తెల్లటి చీరలో, నుదుట సిందూర్‌తో ఆమె అందరినీ ఆకట్టుకుంది. ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచానికి గుర్తుచేసింది. భారత సంప్రదాయాలకు, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య నిలిచింది.
మొదటిరోజు హాఫ్ వైట్ శారీలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించిన ఐశ్వర్య.. రెండోవ రోజు రాయల్ లుక్‌లో కనిపించారు. అయితే, మోడ్రన్ డ్రెస్ ధరించినప్పటికీ ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చారు. తన డ్రెస్‌పై భగవద్గీత శ్లోకంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.
భగవద్గీత శ్లోకం
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ తెలిపారు. ఐశ్వర్య ధరించిన డ్రెస్‌కు ఒక ప్రత్యేకత ఉందని, ఆ బనారసీ కేప్‌పై ‘భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకం ఉందని, చేతితో ఆ శ్లోకాన్ని సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేశారని తెలిపారు.
ఐశ్వర్య భగవద్గీత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఇటీవల భగవద్గీతకు యునెస్కో (UNESCO) మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అందాల తార ఐశ్వర్య మరోసారి ప్రపంచానికి చాటిచెప్పడం కోసమే ఈ డ్రెస్ ధరించి ఉంటారని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Also Read:
మహేశ్ బాబు ఖలేజా.. రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తండ్రైన కిరణ్ అబ్బవరం
For More Film News
Updated Date - May 23 , 2025 | 01:52 PM