ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

FBI Raids Former Trump Adviser: ట్రంప్‌ మాజీ సలహాదారుపై ఎఫ్‌బీఐ దాడులు

ABN, Publish Date - Aug 23 , 2025 | 02:59 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ సలహాదారు జాన్‌ బోల్టన్‌పై అమెరికా అత్యున్నత దర్యాప్తు ...

వాషింగ్టన్‌, ఆగస్టు 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ సలహాదారు జాన్‌ బోల్టన్‌పై అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ తాజాగా దాడులు చేసింది. మేరీలాండ్‌లోని బెతెస్డా ప్రాంతంలోని జాన్‌ బోల్టన్‌ నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నిజానికి వైట్‌హౌజ్‌ జాతీయ భద్రతా సలహదారుగా పనిచేసిన జాన్‌ బోల్టన్‌కు.. ట్రంప్‌ సన్నిహితుడుగా పేరుండేది. కానీ వాణిజ్య విధానాలు, సుంకాల అంశంలో విభేదాలు రావడంతో గతంలోనే ట్రంప్‌ ఆయనను పక్కనపెట్టారు. ఇటీవల జాన్‌ బోల్టన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్‌ ‘దారి తప్పిన అధ్యక్షుడు’ అంటూ విమర్శలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై అదనపు సుంకాలు విధించడం, అదే పనిచేస్తున్న చైనా జోలికి వెళ్లకపోవడంపై ప్రశ్నలు సంధించారు. ఆ కొన్నిరోజులకే జాన్‌ బోల్టన్‌పై ఎఫ్‌బీఐ దాడులు జరిగాయి మరోవైపు, రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో మరోసారి నోరుజారారు. రష్యాకు బట్టలు ఉతికిపెట్టే వాషింగ్‌ మెషీన్‌లా భారత్‌ మారిందని మీడియాతో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 02:59 AM